- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Jagan: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం జగన్
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించారు. వైఎస్సార్ మత్య్సకార భరోసా నిధులను విడుదల చేశారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నిజాంపట్నంలో ఫిషింగ్ హార్బర్ పనులు వాయువేగంగా జరుగుతున్నాయన్నారు. కనివీని ఎరుగని విధంగా 4 కొత్త పోర్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని, వీటి కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని జగన్ తెలిపారు. ఆక్వా రైతుల కోసం విద్యుత్‌పై సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండని సూచించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీం కూడా గుర్తుకురాదన్నారు. అధికారంలో ఉంటే అమరావతి అధికారం కోల్పోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉంటారని అని విమర్శించారు. చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు కుట్రలను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని చూసి విమర్శలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రెండు సినిమాల గ్యాప్ మధ్య దత్తపుత్రుడు పొలిటికల్ మీటింగులు పెడతాడన్నారు. ఇలాంటి వారికి ప్రజా జీవితం తెలుసా అని సీఎం జగన్ ప్రశ్నించారు. తాను పతిపక్షంలో ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని సీఎం జగన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
పవన్ కల్యాణ్, చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్ కార్టూన్ (16-5-2023)
YS Avinash Reddy: నాలుగు రోజులు సమయం ఇవ్వండి.. విచారణరకు హాజరవుతా