- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో మూడేళ్లుగా సీఎం జగన్ ఘన విజయం.. మార్చి 7న మళ్లీ గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక అడుగులు వేస్తున్నారు. బటక్ నొక్కే కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా సిద్ధం సభల వేదికగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 7న అనకాపల్లిలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత నిధులను బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 45 ఏళ్లకు పై బడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేద మహిళలకు 3 విడతలుగా రూ. 18,750ను విడుదల చేశారు. ఇప్పుడు నాలుగోసారి కూడా ఈ నిధులను ఆయన విడుదల చేయనున్నారు.
వైస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం 31 లక్షల 23 వేల 466 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సారి వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు సీఎం జగన్ లేఖ రాయనున్నారు. ఈ లేఖలను లబ్ధిదారులకు వాలంటీర్లు అందించనున్నారు. ఈ లేఖలో జగన్ ఎన్నికల సందేశం ఉండనుందని తెలుస్తోంది.