- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ycp: మరో కొత్త కార్యక్రమం.. డైరెక్ట్ సీఎంవోతోనే మాట్లాడొచ్చు
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. జగనన్నకు చెబుదాం పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈనెల 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయోచ్చని చెప్పుకొచ్చారు. జగనన్నకు చెబుదాం అని చెప్తే సమస్య ఈజీగా పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంవోనే స్వయంగా ఇన్‌వాల్వ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
స్పందన కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకపోతే ఈ వేదికగా పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదునూ వారి సంతృప్తికర స్ధాయిలో పరిష్కరించి చూపించాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. అంతేకాదు ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ ప్రభుత్వ విభాగాల్లో అర్జీలు, ఫిర్యాదుల స్వీకరణకు ఇప్పటికే ఉన్న కాల్ సెంటర్లను అనుసంధానం చేయడం... వినతుల పరిష్కారం కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read..