Breaking: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

by srinivas |   ( Updated:2023-03-24 14:53:32.0  )
Breaking: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మార్చి 14 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి వరకూ సాగాయి. అసెంబ్లీలో మొత్తం 27 బిల్లులు ప్రవేశ పెట్టారు. ఇవాళ అసెంబ్లీలో వాల్మీకిబోయ, దళిత క్రిస్టియన్లను ఎస్టీల్లో చేర్చుతూ అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారం నిరవధికంగా వాయిదా వేశారు.

అంతకుముందు సీఎం జగన్ అసెంబ్లీ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈ నిర్మాణాలను షాపూర్ జీ పల్లోంజి సంస్థ చేపట్టిందని.. ఆ సంస్థ ప్రతినిధి వాసుదేవ్ మనోజ్.. చంద్రబాబు మధ్య డీల్ జరిగిందని ఆయన ఆరోపించారు. షాపూర్ జీ పల్లోంజీ అనే సంస్థపై 2019లో ఐటీ రైడ్స్ జరిగాయని గుర్తు చేశారు. 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై ఐటీ రైడ్స్ జరిగాయని జగన్ తెలిపారు. ఫైనల్‌గా ఐటీ శాక చంద్రబాబుకు నోటీసులు పంపించిందని సీఎం వెల్లడించారు.

ఆ నిధులన్నీ చంద్రబాబుకు చేరాయి...

‘ప్రజా ధనాన్ని తనకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. ఆర్వీ రఘు, కృష్ణ, నారాయణ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరిగా ఆ నిధులన్నీ చంద్రబాబుకు చేరాయి. ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు. ఈ అంశాలన్నీ ఐటీ అధికారుల నివేదికలో ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం ద్వారా కూడా అవినీతికి పాల్పడ్డారు. హైకోర్టు నిర్మాణంలోనూ అవినీతి జరిగింది.’ అని జగన్ అసెంబ్లీలో ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి:

Ap High Court, Secretariat నిర్మాణంపై మంత్రి అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story