- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: పాడి పశువుల కొనుగోలు మాటున ఏపీలో భారీ కుంభకోణం..!
దిశ, వెబ్ డెస్క్: పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. చేయూత స్కీమ్ పేరుతో వైసీపీ స్కామ్ కు పాల్పడిందని ప్రకటన విడుదల చేసింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీహార్ దాణా స్కామ్ కంటే ఇది పెద్ద కుంభకోణం అని ఆయన అభివర్ణించారు. 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్లీలో చెప్పారని, అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు మాత్రమేనని స్పష్టం చేశారు.
పాడి పశువుల కొనుగోలు పేరుతో కొల్లగొట్టిన సొమ్ములు ఎటు పోయాయని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మలను వైసీపీ ప్రభుత్వం నిండా మోసం చేసిందని జనసేన ఆరోపించారు. లక్షల పాడి పశువులు కొని ఉంటే పాల వ్యాపారంలో రూ.14 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగేవని వెల్లడించారు. అది పాల వెల్లువ కాదని... వైసీపీ పాపాల వెల్లువ నడుస్తోందని ఎద్దేవా చేశారు. పాడి పశువుల కొనుగోలుపై సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రజా ధనాన్ని వెనక్కి తీసుకురావాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం
— JanaSena Party (@JanaSenaParty) November 2, 2023
• చేయూత స్కీమ్ పేరుతో వైసీపీ స్కామ్
• బీహార్ దాణా స్కామ్ కంటే పెద్ద కుంభకోణం
• 3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్లీలో చెప్పారు
• అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు… pic.twitter.com/eq8RR60EAq