Tadepalli: యూపీఎస్‌సీ ర్యాంకర్లకు సీఎం జగన్‌ కీలక సూచనలు

by srinivas |
Tadepalli: యూపీఎస్‌సీ ర్యాంకర్లకు సీఎం జగన్‌ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం వైఎస్ జగన్‌ను 2022కు చెందిన యూపీఎస్‌సీ ర్యాంకర్లు భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను ర్యాంకర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి చెందిన 17 మంది యూపీఎస్‌సీ (సీఎస్‌ఈ) 2022 ర్యాంకర్లను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ర్యాంకర్ల కుటుంబ నేపథ్యం విద్యార్హతలు, సివిల్స్‌ ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలు గురించి సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.


ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని వారికి సీఎం జగన్ సూచించారు. మంచి పరిపాలనలో భాగస్వాములై ప్రజా పాలనలో తనదైన ముద్ర వేయాలని ర్యాంకర్లకు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో జీవీఎస్‌ పవన్‌ దత్తా, ఎం.శ్రీ ప్రణవ్,ఎల్‌.అంబికా జైన్,షేక్‌ హబీబుల్లా,కేపీఎస్‌ సాహిత్య,బి.ఉమామహేశ్వర రెడ్డి, పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, వైయూఎస్‌ఎల్‌ రమణి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story