- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gudivada Amarnath: కూటమి పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయి.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudiwada Amarnath) ఆరోపించారు. ఇవాళ ఆయన విశాఖపట్నం (Vishakhapatnam)లో మీడియాతో మాట్లాడుతూ.. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయని ఆరోపించారు. సూపర్ సిక్స్ (Super Six) పేరుతో అన్ని వర్గాలను నిలువునా మోసం చేశారని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ప్రజాధరణ పొందాయని.. నేడు ఆ పథకాలను లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే గత వైసీపీ ప్రభుత్వం (YCP Government)పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము కుప్పలుతెప్పలుగా అప్పులు చేశామంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారని.. కానీ, అధికారంలోకి వచ్చిన కేవలం 7 నెలల్లోనే కూటమి సర్కార్ రూ.1.12 వేల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టబోమని గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు.