- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RRR టీమ్కి గవర్నర్ బిశ్వభూషణ్ అభినందనలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ బృందానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్ర బృందాన్ని, ప్రత్యేకంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిలను గవర్నర్ అభినందించారు. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు అవార్డు రావడం తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సంగీత వేదికపై గర్వింప చేసిందని కొనియాడారు. సాహిత్యం, సంగీతానికి తగ్గట్టు నృత్యరీతులను అభినయించిన నందమూరి తారక రామారావు, కొణిదెల రామ్ చరణ్‌లకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. లాస్ ఏంజెల్స్‌లో బుధవారం జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ఈ చిత్ర బృందం అవార్డును అందుకోగా, భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో అవార్డులను తెలుగు సినిమా పరిశ్రమ గెలుచుకోవాలని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు.
READ MORE