GOOD NEWS:ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి నెలా ఆ తేదీల్లో ఉచిత ఆధార్ శిబిరాలు

by Jakkula Mamatha |
GOOD NEWS:ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి నెలా ఆ తేదీల్లో ఉచిత ఆధార్ శిబిరాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రభుత్వ(Government) లేదా ప్రభుత్వేతర పనులకు ఆధార్ కార్డు(Aadhaar Card) తప్పనిసరిగా మారిపోయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) పొందడానికి కూడా ఆధార్ అవసరం ఉంటుంది. దీంతో ఆధార్ చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు అందరికీ అవసరమే. అంతేకాదు ఈ ఆధార్ కార్డులో తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలు, పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. అయితే రాష్ట్రంలో 11 లక్షల మంది చిన్నారులకు ఆధార్ లేదని అధికారులు గుర్తించారు.

అలాగే ఆధార్ నమోదు చేయించుకున్నప్పటికీ 42 లక్షల మంది బయోమెట్రిక్ చేయించుకోలేదు. వారందరి కోసం ప్రభుత్వం ప్రతి నెల 24 నుంచి 28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలు నిర్వహించనుంది. ఈ క్రమంలో చిన్నారులకు అందుబాటులో ఉండేలా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు చొరవ తీసుకుని ఈ కేంద్రాల్లో పిల్లల ఆధార్‌ నమోదు చేయించాల్సి ఉంది. వీటితోపాటు వివరాల నమోదు, వేలిముద్రల నవీకరణ, చిరునామాల మార్పు- చేర్పులు, వ్యక్తిగత చిత్రాల నవీకరణ, సెల్‌ఫోన్‌ నెంబర్ల మార్పులు, ఇతర దోషాలను ఈ శిబిరాల్లో సరిచేసుకోవచ్చు. మండలాల్లో MPDOలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు శిబిరాలను పర్యవేక్షిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed