- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics: సప్పుడు సేయక్.. మీకింత, మాకింత.. ఆ విషయంలో ఏపీ నేతల ఒప్పందం..
దిశ వెబ్ డెస్క్: యథా రాజా తథా ప్రజా అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ప్రజాపాలకు అవినీతికి అలవాటుపడి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజాసేవకులు ఆ అవినీతి పాలకు సలాం చేస్తూ గులాములగా మారారు అని విశ్లేషకులు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఈ ఐదేళ్ల పాలన సాగిందని, రౌడీలను, గూండాలను వైసీపీ ప్రభుత్వం పెంచిపోషించిందని, అందుకు పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, గత ఐదేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే నిదర్శనం అని విశ్లేషకులు తెలిపారు.
నేరాలకు పాల్పడిన నేతలు బయట.. వాళ్ల అనుచరులు లోపల..
అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. అధికార దాహంతో అమాయకులను రెచ్చగొట్టి రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించిన నేతలు తమ దగ్గర ఉన్న అధికారాన్ని, డబ్బును అడ్డుపెట్టుకుని కేసుల నుండి బయటపడుతున్నారని, అవి రెండూ లేని నేతల అనుచరులు తప్పుడు కేసుల్లో చిక్కుకుని జైలు జీవితాన్ని గడుపుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రౌడీ మూకలను పెంచి పోషిస్తోంది వైసీపీ నేతలే..
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించారని, ముఖ్యంగా ప్రజల ఆస్తులను కబ్జా చేశారని, ఈ నేపథ్యంలో తమకు అడ్డు చెప్పిన వాళ్లను, ఎదురు తిరిగిన వాళ్లను నిలువునా చంపేశారని, స్వలాభం కోసం రౌడీలను, గూండాలను పెంచి పోషిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రాలో క్రైమ్ రేటు పెరిగిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నాయకులకు తొత్తులుగా మారిన పోలీస్, రెవెన్యూ యంత్రాంగం..
మాపై పలానావాళ్లు దౌర్జన్యం చేస్తున్నారు, మీరే మాకు రక్ష అని పోలీసులను శరణు కోరితే, యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు యాక్షన్ తీసుకోకపోగా కేసు నమోదు చేయాలి అంటే స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాలి అని పోలీసులు, బాబు మా ల్యాండ్‌ను కబ్జా చేశారు, వెబ్ రికార్డుల్లో మా పేరు మారుస్తున్నారు, ఎంక్వయిరీ చేసి మా ల్యాండ్‌ను మాకు ఇప్పించండి అని అడిగితే, స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాలి అని రెవెన్యూ అధికారులు అంటున్నారని ఆంధ్రా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు సేవ చేయాల్సి పోలీస్, రెవెన్యూ యంత్రాంగం స్వలాభాల కోసం, ప్రమోషన్ల కోసం రాజకీయ నాయకులకు తొత్తులుగా మారని, మీకింత, మాకింత అనే ఒప్పందంతో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతూ.. రాష్ట్రాన్ని రావణ రాజ్యంగా మారుస్తున్నారని, డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు, కలెక్టర్ నుండి ప్యూన్ వరకు ప్రజా సేవ మానేసి పాలకుల సేవ చేస్తున్నారని విశ్లేషకులు తెలిపారు.
ఇందుకు పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలే నిదర్శనం అని, రాష్ట్రంలో పలు చోట్ల మారణహోమం రగిలితే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని విశ్లేషకులు పేర్కొన్నారు. .