- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బుడమేరు ఆక్రమణలపై ప్రభుత్వం సిరీయస్... త్వరలో యాక్షన్ ప్లాన్..!
దిశ, ఏపీ బ్యూరో: మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా బుడమేరు ఆపరేషన్‌ను చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కబ్జాలు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చెరువులు, గెడ్డల ఆక్రమణలను తొలగించి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. కొంతమంది స్వార్థపరుల కోసం ప్రజలు, ప్రభుత్వం ఇన్ని త్యాగాలను చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని, ప్రజల భద్రతకోసం చేయాల్సిందంతా చేస్తామని సీఎం స్పష్టంచేశారు. మరలా ఎక్కువ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి గుంటూరు, ప్రకాశం, బాపట్ల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఏలేరు రిజర్వాయర్‌కు పిఠాపురం ప్రాంతంలో ముంపు వచ్చే అవకాశమున్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నాం..
బుడమేరు విషయంలో టెక్నాలజీని పూర్తిగా వాడి.. డేటాను క్షుణ్ణంగా విశ్లేషించి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.. ఇళ్లలో పాడైన వస్తువులను తక్కువ ఖర్చుతో రిపేర్ చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నష్టాన్ని బేరీజు వేసుకొని ఏ విధంగా ఆర్థిక సహాయం అందించాలో ఎన్యూమరేషన్ చేసి అందిస్తామన్నారు. గత అయిదేళ్లలో ఏ ఒక్క డ్రెయిన్‌నూ పట్టించుకోలేదని, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లను సైతం శుభ్రం చేయకుండా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వరద ప్రాంత ప్రజల కష్టాలను చూస్తే చాలా బాధేస్తోందని, అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు నిద్రపోకుండా పండగ రోజు కూడా పని చేశారన్నారు.