- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో డెవలప్‌మెంట్ స్టార్ట్.. తొలుత 8 మున్సిపల్ కార్పొరేషన్లకు మోక్షం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ముందుగా పార్కులు, రోడ్లను డెవలప్ మెంట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డివైడర్లు, రోడ్ల గుంతలు, డ్రైయిన్ల పూడికత పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సెంట్రల్ డివైడర్లలో ఉన్న ఫ్లెక్సీలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఆయా ఫ్లెక్సీలను తొలగించేందుకు రెడీ అవుతోంది.
తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తొలుత 8 మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, టిడ్కో ఇళ్లపై చర్చించారు. పార్కులు, డివైడర్లు, రోడ్ల గుంతలు, డ్రెయిన్లలో పూడిక తీతలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్‌పై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. టిడ్కో ఇళ్లు వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.