- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
APSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శివరాత్రికి స్పెషల్ బస్సులు

దిశ,వెబ్‌డెస్క్: శివరాత్రి పండుగ వేళ ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. మహా శివరాత్రి(Maha Shivratri) సందర్భంగా శైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
మహా శివరాత్రికి భక్తులు(Devotees) అధిక సంఖ్యలో తరలి వస్తారని ఏపీఎస్‌ఆర్టీసీ అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు భక్తులు వెళ్లి వచ్చేందుకు వీలుగా.. 3,500 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ(RTC) కేటాయించింది. అయితే.. అత్యధికంగా వైఎస్‌ఆర్(YSR) జిల్లాలోని 12 క్షేత్రాలకు, నెల్లూరు(Nellure) జిల్లాలోని 9 క్షేత్రాలకు, తిరుపతి(Tirupati) జిల్లాలోని 9 క్షేత్రాలకు, నంద్యాల(Nandyal) జిల్లాలోని 7 క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేసింది.