- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics:పవన్ కల్యాణ్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి: కొణిదెల నాగబాబు
దిశ, పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని పవన్ సోదరుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో బుధవారం సాయంత్రం రోడ్ షోలో నాగబాబు పాల్గొన్నారు. గొల్లప్రోలులో మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. ఈసందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ పిఠాపురం ఇన్‌ఛార్జి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నుంచి భారీ మోటారు సైకిళ్లతో పెద్ద ఎత్తున టిడిపి, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి రోడ్ షో ను వియజయవంతం చేశారు.