- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు ఘన విజయం

దివ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు(Uthandhra Teacher MLC Gade Srinivasulu) విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల(Second Priority Votes)తో ఆయన గెలుపొందారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ(APTF candidate Raghu Varma)పై శ్రీనివాసులు విజయం సాధించారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ లెక్కింపులో రఘువర్మపై గాదె శ్రీనివాసులు ఆధిక్యం సాధించారు. దీంతో శ్రీనివాసులు గెలుపొందారు.
గత నెల 27న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 19813 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే గాదె శ్రీనివాసులు నాయుడుకు 7210 ఓట్లు రాగా.. పాకలపాటి రఘువర్మకు 6845 ఓట్లు, కే. విజయ గౌరీ 5804 ఓట్లు వచ్చాయి. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థుల విజయం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.