- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ హైకోర్టుకు నలుగురు జడ్జీలు
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎం. కిరణ్మయి, జస్టిస్ జె.సుమతి, జస్టిస్ ఎన్.విజయ్ లను హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫారసు చేసింది. త్వరలోనే ఈ నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఈ నలుగురు జడ్జిలు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించినట్లు కొలీజియం స్పష్టం చేసింది. అయితే ఈ న్యాయవాదులను జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు సైతం వారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీపై ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.