- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాలకు మాజీ మంత్రి బండారు బై బై
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి టికెట్ ఆశించిన ఆయనకు ఆశాభంగం కలిగింది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేశ్‌కు దక్కింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు. ఒకానొక సమయంలో వైసీపీ నేతలతో బండారు టచ్‌లోకి వెళ్లారని, ఆ పార్టీ అధినేత సీఎం జగన్ అనకాపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. అయినా సరే బండారు సత్యనారాయణ టీడీపీ చివరి జాబితా విడుదల వరకూ వేచి చూశారు. అయితే పార్టీ మారడం ఇష్టం లేని ఆయన రాజకీయాలకు స్వస్థి చెప్పారు. ఈ విషయాన్ని విశాఖ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో నిర్వహంచిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, రాజకీయంగా తనకు ఇదే చివరి సమావేశం అని చెప్పారు. తాను రాజకీయాలను తప్పుకుంటున్నా పార్టీ కార్యకర్తలకు మాత్రం ఎప్పుడూ అండగా ఉంటానని బండారు సత్యనారాయణ ప్రకటించారు.