- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ కోసం రూ.3లక్షలు ఖర్చు చేశా..నా ఉసురు తగులుతుంది: వైసీపీ ఎమ్మెల్యేని కడిగిపారేసిన మాజీ ఎంపీపీ
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంజీవయ్య వైసీపీ నాయకురాలు ఇంటికి వెళ్లారు. దీంతో ఎమ్మెల్యేను చూసిన ఆ వైసీపీ మహిళా నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నా శాపం..నా ఉసురు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం మాజీ ఎంపీపీ, వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు ముమ్మారెడ్డి ఇందిరమ్మ ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె ఎమ్మెల్యేను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.3 లక్షలు ఖర్చు పెట్టి సాధారణ ఎన్నికల్లో మీకు ఆధిక్యం తెప్పించా అని గుర్తు చేశారు. అలాంటి తనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరని ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. ఏరోజుకైనా తన శాపం తగులుతుంది అని శాపనార్థాలు పెట్టారు. ఇకపోతే ఇందిరమ్మ మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవిని ఆశించారు. అయితే ఆమెకు పదవి కట్టబెట్టడంలో ఎమ్మెల్యే సంజీవయ్య సహకరించలేదు. దీంతో అప్పటి నుంచి ఇందిరమ్మ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు దొరుకుతారా? ఎమ్మెల్యేను కడిగిపారేద్దామని ఎదురుచూసిన ఆమెకు శనివారం ఆ సమయం రానే వచ్చింది. ఎమ్మెల్యే సంజీవయ్య ఇంటికి రాగానే తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు...దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి YCP కి 9 ప్రశ్నలతో బీజేపీ ఛాలెంజ్ : 9నుంచి 90మంది వచ్చినా పర్వాలేదని ఆఫర్