- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీసుల విచారణకు హాజరైన మాజీ ఎంపీ

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత(YCP Leader), మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former MP Gorantla Madhav) విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల నేడు(గురువారం) విచారణకు హాజరయ్యారు. లైంగికదాడి బాధితుల పేర్లను బయటపెట్టారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma) ఇచ్చిన ఫిర్యాదుతో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదైంది. ఇలా పేర్లు బయట పెట్టడం నిబంధనలకు విరుద్ధమని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. విజయవాడ(Vijayawada) సైబర్ క్రైమ్ పీఎస్(Cyber Crime Police Station) లో నిన్న(బుధవారం) హాజరు కావలసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డుమ్మాకొట్టారు. ఈ క్రమంలో ఆయన విజయవాడ వెళ్తున్నానని, పోలీసుల ప్రతి ప్రశ్నకు జవాబిస్తానని ప్రకటన చేశారు. చివరకు బుధవారం పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. గురువారం వస్తానని వారికి సమాచారం ఇచ్చారు.