- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయంగా జగన్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరడంపై ఆయన స్ట్రాంగ్‌గా స్పందించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో చేరేందుకు నాయకులు రాజీనామాలు చేయాలని చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తమ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు ఎంత మందితో రాజీనామా చేయించారని ప్రశ్నించారు. ఏలూరు, విశాఖలో వైసీపీ కార్పొరేటర్లు, మేయర్లు టీడీపీలో చేరారని, మరి వారి సంగతేందని నిలదీశారు. వాళ్లంతా ఏ పార్టీ గుర్తుపై గెలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలు మారే వారి కరెక్టర్లను పరిశీస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి జైలుపాలు చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి ఆయన పార్టీని లాక్కుని చంద్రబాబు లబ్ధిపొందారని వ్యాఖ్యానించారు. కానీ ఎన్టీఆర్ జగన్ అమాయకుడు కాదని పేర్ని నాని హెచ్చరించారు.