- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆధారాలుంటే కేసులు పెట్టండి: పత్రాల దగ్ధంపై స్పందించిన అంబటి
X
దిశ, వెబ్ డెస్క్: ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం పత్రాలు దగ్ధం ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గత ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలే పత్రాలు దగ్ధం చేస్తున్నారన్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. పత్రాలు దగ్ధం అయితే ఆధారాలు ఉండవా అని ప్రశ్నించారు. పత్రాలన్నీ డిజిటలైజేషన్ జరిగాయన్నారు. మదనపల్లె సబ్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయితే మంత్రి పెద్దిరెడ్డి తగులబెట్టించారని కొందరు నేతలు ప్రచారం చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పత్రాలు ఒక్క చోటే ఉంటాయా అని ప్రశ్నించారు. ఫైళ్ల దగ్ధంపై ఆధారాలు ఉంటే కేసులు పెట్టాలని సూచించారు. అబద్ధాలను నమ్మించే ప్రయత్నాలు ఎంతకాలం చేస్తారని మాజీ మంత్రి అంబటి నిలదీశారు.
Advertisement
Next Story