AP:వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన మాజీ సీఎం జగన్

by Jakkula Mamatha |   ( Updated:2024-09-04 14:55:33.0  )
AP:వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించిన మాజీ సీఎం జగన్
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో గత నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టించాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఏపీలోని విజయవాడ జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. లక్షలాది మంది ప్రజలు ముంపునకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమై ఉంది.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైయస్‌ జగన్‌ (YS Jagan) నాయకులతో సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నాయకులు, ఎన్టీఆర్‌ జిల్లా (NTR District) పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం(Food), మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు వైఎస్ జగన్‌కు తెలిపారు.

Advertisement

Next Story