- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్ అదాలత్ తో రాజీ మార్గమే రాజమార్గం.. న్యాయమూర్తి పి.మంగాకుమారి
దిశ, ఏలూరు: లోక్ ఆదాలత్ ద్వారా రాజీపడి అవార్డు పొందిన కేసుల్లో ఇరుపక్షాలు గెలిచినట్లేనని జిల్లా మొదటి ప్రధాన న్యాయమూర్తి పి.మంగాకుమారి స్పష్టం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి.మంగాకుమారి మాట్లాడుతూ.. కక్షిదారులు స్నేహపూరిత వాతావరణంలో ఉండాలంటే రాజీమార్గాన్నే అనుసరించాలని సూచించారు. ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని కోర్టు పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు. కావున కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ కార్యదర్శి శ్రీ రాజేశ్వరి, ఏలూరు భారసోసియేషన్ ప్రెసిడెంట్ టి శశిధర్ రెడ్డి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మొత్తం 7276 కేసులు పరిష్కరించగా.. అందులో 6945క్రిమినల్, 200 సివిల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాద బీమా కేసుల్లో 128 పరిష్కారం చేసి రూ.9,02,16,000 పరిహారంగా కక్షిదారులకు చెల్లించినట్లు, 212 ప్రీలిటిగేష కేసులు పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు.