- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. చైన్ లాగడంతో
దిశ,వెబ్‌డెస్క్: ఒడిశారైలు ప్రమాదం మరవక ముందే..రైల్వేలో మరో ప్రమాదానికి తావిచ్చింది. మచిలీపట్నం -తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్ రైలు తిరుపతికి వెళ్తుండగా బోగీల్లోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలులో మంటలు వ్యాప్తి చెందకుండా ఆగిపోయాయి. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు దిగడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. ఈ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చారు. 20 నిమిషాల తర్వాత తిరిగి తిరుపతికి రైలు బయల్దేరింది. రైల్వేలో జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలవల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల భారి నుండి తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: బిగ్ బ్రేకింగ్: ఒడిషాలో పట్టాలు తప్పిన మరో ట్రైన్