Big Breaking: నందిగామలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య పోరు

by Indraja |   ( Updated:2024-01-16 08:34:32.0  )
Big Breaking: నందిగామలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య పోరు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయా అనేల నేతల తీరు ఉందని ప్రస్తుతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు అన్నాకా ఒక పార్టీని మరో పార్టీ విమర్శించడం సహజం. అయితే ఆ విమర్శలు ప్రజల సమస్యల పై పోరాడుతూ.. హుందాగా ప్రశార్ధకంలా ఉండాలి. కానీ ప్రస్తుతం రాజకీయ నేతలు ప్రజల కోసం పోరాడడం మానేసి వ్యక్తిగత విషయాలతో విచక్షణ రహితంగా విజ్ఞతను కోల్పోయి ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు.

ఒకరి పైన ఒకరు వ్యక్తిగత కామెంట్స్ చేసుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ పర్యటనలో పాల్గొన్న వైసీపీ నేత దుబాయ్ కరిముల్లా భహిరంగ సభలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సౌమ్యపై కామెడీ మీమ్స్ వేశారు. ఈ ఘటన పై స్పందించిన సౌమ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ దుబాయ్ కరిముల్లా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఫిర్యాదు చేసి రెండు రోజులు గడుస్తున్నా పోలీసులు మాత్రం తాను చేసిన ఫియరాదు పై స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. పోలీసుల వైకిరి పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆమె.. టీడీపీ నేతలతో కలిసి దుబాయ్ కరిముల్లా ఇంటికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఆమెను టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే సౌమ్య, ఆచంట సునీత, టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో నందిగామ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలకు పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా ఇరువురికి మాటా మాటా పెరిగింది.. చినుకు చినుకు కలిసి గాలివానగా మారినట్టు టీడీపీ శ్రేణుల, పోలీసులు మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Advertisement

Next Story