AP News: మేనమామ కాదు.. మానవమృగం.. ఆధార్ మార్పులకోసం తీసుకొచ్చి దారుణం

by Rani Yarlagadda |
AP News: మేనమామ కాదు.. మానవమృగం.. ఆధార్ మార్పులకోసం తీసుకొచ్చి దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: మేనమామే కదా అని నమ్మి వెళ్లిన బాలిక జీవితాన్ని చిదిమేశాడు ఆ దుర్మార్గుడు. మనిషి రూపంలో ఉన్న మానవమృగం అని తెలియక.. ఆధార్ (Aadhar Card)లో మార్పుల కోసం వెంటే వెళ్లగా.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari) చాగల్లు (Chagallu) మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక నిడదవోలు మండలంలోని ఓ హాస్టల్ లో ఉండి 9వ తరగతి చదువుతోంది. ఆమె తల్లి ఉద్యోగం నిమిత్తం గల్ఫ్ కి వెళ్లగా.. తండ్రి వేరుగా ఉంటున్నాడు. ఆమె అమ్మమ్మే బాగోగులు చూసుకుంటోంది.

ఆధార్ కార్డులో మార్పులు చేయాల్సి ఉండటంతో.. నవంబర్ 14న బాలికకు వరుసకు మేనమామ అయ్యే కమల్ కు రూ.100 ఇచ్చి పంపింది బాలిక అమ్మమ్మ. బైక్ పై బాలిక ఉండే హాస్టల్ కు వెళ్లిన కమల్.. బాలికను ఎక్కించుకుని చాగల్లు మండలంలో ఉన్న అతని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తాడేపల్లిగూడెం మండలంలో ఉన్న బాలిక అమ్మమ్మ ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. బాలిక తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా.. ఏం జరిగిందని అడిగింది అమ్మమ్మ. దాంతో జరిగిన విషయాన్ని చెప్పింది.

వెంటనే నిడదవోలు (Nidadavolu) ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు చికిత్స చేశారు. కూతురిపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలిసిన తండ్రి.. శుక్రవారం (నవంబర్ 15) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో (Pocso) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed