- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking News : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మందికి తీవ్ర గాయాలు

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. చిత్తూరు(Chittur) జిల్లాలోని చిల్లకూరు మండలం బూధనం టోల్ ప్లాజా(Budhanam Toll Plaza) వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు(RTC Bus) ను, తిరుపతికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) టోల్ ప్లాజా వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొన్నది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. అనేకమందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని గూడూరు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో కొద్ది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలను విశ్లేసిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.