మాజీమంత్రి నారాయణకు మరదలిపోటు: ఐఆర్ఆర్ కేసులో సీఐడీకి ఆధారాలిస్తానంటూ ప్రియ వీడియో

by Seetharam |
మాజీమంత్రి నారాయణకు మరదలిపోటు: ఐఆర్ఆర్ కేసులో సీఐడీకి ఆధారాలిస్తానంటూ ప్రియ వీడియో
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి పొంగూరు నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-2గా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మాజీమంత్రి నారాయణను ఈ కేసులో విచారించాలని సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వాట్సాప్ ద్వారా నోటీసులు ఇచ్చింది. అయితే ఏపీ హైకోర్టు నారాయణ ముందస్తు బెయిల్ మరో రెండు వారాలు పొడిగించడంతో విచారణ కాస్త వాయిదా పడింది. దీంతో మాజీమంత్రి పొంగూరు నారాయణ ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి తరుణంలో మాజీమంత్రి పొంగూరు నారాయణ మరదలు పొంగూరు ప్రియ షాక్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు విచారణలో తమ బావ పొంగూరు నారాయణ తనకేం తెలియదు గుర్తులేదు అనొచ్చు కానీ నారాయణకు అన్నీ తెలుసు అని చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ బినామీ పేర్లతో స్థలాలు ఉన్నాయో అన్నీ కూడా తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. తనను కూడా ఈ కేసు విచారణలో భాగస్వామ్యం చేయాలని తాను కొన్ని పేర్లు వెల్లడిస్తానని పొంగూరు ప్రియ ఓ వీడియో విడదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారింది. అంతేకాదు సీఐడీకి తన వద్ద ఉన్న ఆధారాలు అందజేస్తానని మాజీమంత్రి పొంగూరు నారాయణ మరదలు ప్రియా వెల్లడించారు. సీఐడీ తనను సంప్రదిస్తే నారాయణ అక్రమాలకు సంబంధించి అన్ని విషయాలు తాను తెలియజేస్తానని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనను కూడా విచారణ చేస్తే నారాయణ సంపాదించిన అక్రమాస్తులు.. ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో అనేది ఒక వ్యక్తి సహకారంతో పూర్తి వివరాలు అందజేస్తానని సీఐడీని పొంగూరు ప్రియా వెల్లడించారు. ఈ అవకాశాన్ని సీఐడీ అధికారులు ఉపయోగించుకోవాలని కోరారు. మరోవైపు మాజీమంత్రి నారాయణ అక్రమాలు, నెల్లూరు సిటీకి ఇచ్చిన హామీలపై వచ్చే ఎన్నికల్లో తాను ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తానని పొంగూరు ప్రియ వెల్లడించారు.

Advertisement

Next Story