ఏపీలో భారీగా పెరిగిన ఓటర్లు.. ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే..!

by Disha Web Desk 16 |
ఏపీలో భారీగా పెరిగిన ఓటర్లు.. ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలు సిద్ధమయ్యాయి. అభ్యర్థులను సైతం ప్రకటించారు. నామినేషన్లూ వేశారు. అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన ఫైనల్ కూడా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుం ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలక్షన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న ఎన్నికల కేంద్రాలు, ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై స్పష్టం ఇచ్చారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు ముఖేష్ కుమార్ తెలిపారు.


ఎన్నికల ప్రక్రియను పడక్బందీగా చేపడుతున్నట్లు ముఖేష్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 14 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 46 వేల 389 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తు్న్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకూ వివిధ తనిఖీల్లో రూ. 203 కోట్లు పట్టుబడినట్లు పేర్కొన్నారు. ‘ఇప్పటి వరకూ 72, 416 మందిని బైండోవర్ చేశాం. ఇప్పటివరకూ హోంఓటింగ్‌కు 28 వేల 591 మంది దరఖాస్తు చేశారు. ఈ నెల 8లోపు హోం ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది.’ అని ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.

కాగా ఎన్నికల్లో 3, 93 లక్షల 45 వేల 717 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటర్లు 4 కోట్లకు దాటిపోయారు. ఈసారి కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం.

Next Story

Most Viewed