కాకినాడలో నాపై పోటీ చేయ్.. పవన్‌కు ద్వారంపూడి సవాల్

by srinivas |   ( Updated:2023-10-07 10:40:17.0  )
కాకినాడలో నాపై పోటీ చేయ్.. పవన్‌కు ద్వారంపూడి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ద్వారం‌పూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. కాకినాడలో తనపై పోటీ చేసి పవన్ కల్యాణ్ గెలవాలని ఛాలెంజ్ చేశారు. బీజేపీతో పొత్తు లేకుండా పవన్ బయటకు రావాలని సూచించారు. పవన్‌ వద్ద విదేశీ సొమ్ము ఉందని, అదంతా త్వరలో బయటకు రావడం ఖాయమన్నారు. రూ.1400 కోట్లు హవాలా ద్వారా దేశం దాటి వెళ్లిందని ఆరోపించారు. దుబాయ్, రష్యా, సింగపూర్‌లో ఎక్కడికి వెళ్లాయో త్వరలో తేలిపోతుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

ఏపీలో పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తులో ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. అటు బీజేపీతోనూ కలిసే ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి తీసుకొస్తానని ఇప్పటికే పవన్ పలుమార్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed