Accident: కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనాలు.. ఇద్దరు దుర్మరణం

by srinivas |
Accident: కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనాలు.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో హైవే ఫ్లై ఓవర్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పంక్చర్ అయ్యింది. దీంతో ఆ కారు రైట్ సైడ్‌కి దూసుకెళ్లి బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ రెండు వాహనాలు అటుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన వ్యక్తిని కొవ్వూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story