- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జి రాగంపేటలో పెను విషాదం.. ఏడుగురు మృత్యువాత
దిశ,పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేటలో పెను విషాదం జరిగింది. అంబటి సుబ్బన్న ఆయిల్ కర్మాగారంలో ట్యాంకులను శుభ్రం చేసే సమయంలో విషవాయువులు ఉత్పత్తి అయి ఊపురాడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు. దీంతో జి.రాగంపేట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుల్లో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన వాసులు కాగా, పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.
విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ కృత్తికా శుక్ల,జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, మాజీ మంత్రి, శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప, అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫ్యాక్టరీ సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఫ్యాక్టరీలో భద్రత ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేదానిపై కూడా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.