- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్‌కు చంద్రబాబు పెద్దనాన్న, లోకేశ్ తమ్ముడు.. కొత్త వరసలు చెప్పిన ద్వారంపూడి
దిశ, డైనమిక్ బ్యూరో: బొమ్మాళీ నిన్నొదలా అనే డైలాగు మనం అరుంధతి సినిమాలో చూశాం. ఇప్పటికీ ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదే డైలాగును వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫాలో అవుతున్నట్లున్నారు. పవన్ నిన్నొదలా అన్నట్లు రోజూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వారాహి విజయయాత్ర ప్రారంభం నుంచి పవన్ కల్యాణ్ వర్సెస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిగా రాజకీయం మారిపోయింది. ఇరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం అమలాపురంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం విమర్శల దాడి మాత్రం చేస్తూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కల్యాణ్ తనపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు కుమ్మక్కై తనను టార్గెట్ చేశారని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కాకినాడను ఏదో నేరాలకు అడ్డాగా మార్చేసినట్లు పవన్ చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ప్రశాంతంగా ఉన్న కాకినాడకు చెడ్డపేరు తేవద్దని పవన్ కల్యాణ్‌ను కోరారు. గంజాయి, రౌడీయిజం, రైస్ అక్రమ ఎగుమతులు అంటూ తప్పుడు ప్రచారం చేయోద్దని సూచించారు.
మరోవైపు తాను అవినీతిపరుడంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ద్వారంపూడి మండిపడ్డారు. గత 50 ఏళ్లుగా రైస్ ఇండస్ట్రీలో తమ కుటుంబం ఉందని..ఇప్పుడు తాము రైస్ మిల్లులు నిర్వహించడం లేదని కేవలం ఎగుమతులు మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. రైస్ మిల్లులను అద్దెకు ఇచ్చేశామని కావాలంటే లీజ్ అగ్రిమెంట్లు చూపిస్తామని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైస్ ఎక్స్ పోర్ట్ వ్యాపారంలో దేశంలోనే తాము 7వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు నాయుడు పెదనాన్న లాంటి వారని....లోకేశ్ తమ్ముడు అని కొత్త వరసలు కలిపారు. ఈ ముగ్గురు వైసీపీ ప్రభుత్వంపై ఒకే రీతిలో విమర్శలు చేయడం చూస్తుంటే ముగ్గురు ఒక్కటేననడానికి అంతకంటే ఏం కావాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :: Minister Roja: రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు ఎందుకు వారాహి యాత్ర..