Rajahmundry: సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ చురకలు.. వ్యతిరేకం కాదంటూనే వార్నింగ్

by srinivas |   ( Updated:2023-10-23 13:49:16.0  )
Rajahmundry: సీఎం జగన్‌కు పవన్ కల్యాణ్ చురకలు.. వ్యతిరేకం కాదంటూనే వార్నింగ్
X

దివ, వెబ్ డెస్క్: వైసీపీ అరాచకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశం అనంతరం నారా లోకేశ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని మండిపడ్డారు. అంతేకాకుండా ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని.. అందుకే 2014లో మద్దతు ఇచ్చానని పవన్ తెలిపారు. తాము వైసీపీకి, సీఎం జగన్‌కు వ్యతిరేకంకాదన్నారు. వైసీపీ విధానాలను, అరాచకాలను వ్యతిరేకిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. వైసీపీని అధికారంలో నుంచి దింపడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యచరణతో ముందుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

వైసీపీ పోవాలి.. టీడీపీ, జనసేన రావాలి..

వైసీపీ ప్రభుత్వం పోవాలని.. టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ దోపిడీకి పాల్పడుతోందని తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీ అస్థిరతకు గురైందని, స్థిరత్వం కోసం పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి వైసీపీ వైరస్ పట్టుకుందని.. జనసేన, టీడీపీ వ్యాక్సిన్ కావాలని సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు ఏ పార్టీని వదలడంలేదని, ప్రజలకు భరోసా ఇవ్వడం ప్రధాన లక్ష్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed