CM Chandrababu Naidu : బంకచర్ల ప్రాజెక్టుకు అడ్డుపడకండి : సీఎం చంద్రబాబు

by M.Rajitha |
CM Chandrababu Naidu : బంకచర్ల ప్రాజెక్టుకు అడ్డుపడకండి : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : గోదావరి నది(Godavari River)పై ఏపీ నిర్మిస్తున్న బంకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) విజయం సాధించిన కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati RajendraPrasad), పేరాబత్తుల రాజశేఖర్(Perabathula Rajashekhar) ల విజయోత్సవ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను అభినందించారు. ఈ గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ల వంటివని అన్నారు. గోదావరి నదిపై తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) ఎంత ముఖ్యమైనదో ఏపీకి బంకచర్ల ప్రాజెక్ట్(Bankacharla Project) అంతా ముఖ్యమైనది అని స్పష్టం చేశారు.

కాళేశ్వరంపై తాము రాజకీయం చేయలేదని, బంకచర్లను కావాలనే రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకొని, ఆ నీటిని వాడుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇక్కడ సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. తెలుగు జాతిని అగ్రగామిగా నిలపాలన్నదే తన లక్ష్యమని ఆయన తెలియజేశారు. గత వైసీపీ(YSRCP) ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి తీసుకు రాలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్(Vishakha Steel Plant) ను నిలిపామని, వైజాగ్ కు రైల్వే జోన్, కొత్త విమానాశ్రయాలు, మెట్రోప్రాజెక్టులు తీసుకు వచ్చామని వెల్లడించారు.

Next Story

Most Viewed