Devineni Avinash: దుబాయ్‌కి వెళ్లేందుకు దేవినేని అవినాష్‌ యత్నం.. షాకిచ్చిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు

by Shiva |   ( Updated:2024-08-16 14:38:03.0  )
Devineni Avinash: దుబాయ్‌కి వెళ్లేందుకు దేవినేని అవినాష్‌ యత్నం.. షాకిచ్చిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవినేని అవినాష్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు షాకిచ్చారు. గురువారం రాత్రి ఆయన దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. దీంతో అక్కడున్న అధికారులు అవినాష్‌‌ను అడ్డుకున్నారు. వెంటనే ఆ సమాచారాన్ని అధికారులు మంగళగిరి రూరల్ పోలీసులకు తెలియజేశారు. ఆయనపై పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదై ఉన్నందున దుబాయ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వొదంటూ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుకు తెలిపారు. దీంతో వారు అవినాష్‌‌ను ముందుకు కదలనివ్వలేదు. ఇక చేసేది ఏమి ఆయన అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.

కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో దేవినేని అవినాష్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసులో ఆయన ముందుస్తు బెయిల్‌పై ఉన్నారు. ఈ క్రమంలో వారు విదేశాలకు వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా, దుబాయ్ వెళ్తుండగా ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు.

Advertisement

Next Story