- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pawan Kalyan:ఆ గ్రామం పై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు.. కారణం ఏంటంటే?

దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ పాలన పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) విమర్శలు గుప్పించారు. వైసీపీ(YSRCP) పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమైందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు కేటాయించకుండా దారి మళ్లించారని వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫైరయ్యారు. దీని వల్ల గ్రామాల అభివృద్ధి(Development of villages) కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అన్నారు.
ఈ క్రమంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ(Gram Panchayat System) ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ.. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari district) విస్సా కోడేరు గ్రామం(Vissa Koderu village) ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందని పవన్ కల్యాణ్ కొనియాడారు. రూ.10 లక్షలతో తాగునీటి సమస్యకు గ్రామ పంచాయతీనే పరిష్కారం చూపిందన్నారు.
ఈ క్రమంలో ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులతో రెండు ఫిల్టర్ బెడ్లు, నిరుపయోగంగా ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని గ్రామస్థులే మరమ్మతు చేసుకున్నారని తెలిపారు. నూతన పైప్ లైన్ వేసి.. తాగునీటి సమస్య లేకుండా చేసుకున్నారని ప్రశంసించారు. ఈ విధంగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు పంచాయతీని, గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీ రాజ్(Zilla Panchayat Raj), నీటి సరఫరా శాఖ (Water Supply Department) అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.