పార్వతీపురం జిల్లాలో గాలివాన బీభత్సం

by srinivas |   ( Updated:2024-06-14 11:54:27.0  )
పార్వతీపురం జిల్లాలో గాలివాన బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతారణం మారడంతో పాటు భారీ ఈదురు గాలులతో జిల్లాలో వర్షం విరుచుకుపడింది. దీంతో సాలూరులో పలు చోట్ల ఇళ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుచోట్ల కరెంట్ స్తంభాలు కిందపడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా గాలి వాన బీభత్సం సృష్టించడంతో సాలూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed