గోదావరి ఉగ్రరూపం..కళ్లముందే నదీ గర్భంలో కలిసి పోతున్న లంక భూములు

by srinivas |   ( Updated:2024-08-01 11:46:43.0  )
గోదావరి ఉగ్రరూపం..కళ్లముందే నదీ గర్భంలో కలిసి పోతున్న లంక భూములు
X

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో లంక గ్రామాల పంట భూములు కోతకు గురవుతున్నాయి. కొబ్బరి తోటలతో పాటు అరటి పంటలను సైతం గోదావరి వరదలో కొట్టుకుపోతున్నాయి.


మరోవైపు వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్దగౌతమి నదులు పది రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అయినవిల్లి మండలం పొట్టిలంక యలకల్లంకలో గోదావరి నది ఉధృతిగా ప్రవహిస్తోంది. ఈ ఉధృతిలో కొబ్బరి చెట్లు కొట్టుకుపోతున్నాయి. లంక భూములు సైతం కళ్లముందే నదీ గర్భంలో కలిసి పోతున్నాయి. ఎకరాలకు ఎకరాల భూమి గోదావరిలో కలిసిపోతోంది.


దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరద ఉధృతిలో పడవపై వెళ్లి కొట్టుకుపోతున్న లంక భూములను చూసి రైతులు లబోదిబోమంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed