- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగులు మార్చే రాజకీయ వ్యభిచారి కేశినేని నాని : బుద్దా వెంకన్న ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: గుండెలో దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేయాలంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును సవాల్ చేసిన కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మాటల దాడికి దిగారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ... కేశినేని నాని రంగులు మార్చే ఓ రాజకీయ వ్యభిచారి అని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు టీడీపీలో ఉండి వైసీపీ కొమ్ము కాశాడని ఆయన మండిపడ్డారు. ఏనాడు ఆయన టీడీపీ సంక్షేమానికి పాటుపడలేదని, నాయకులతో సరిగ్గా కలిసి పని చేయలేదని ఆరోపించారు.
వైసీపీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ కొవర్టు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. కేశినేని నాని కొవర్టు అయితే, వల్లభనేని వంశీ అంతకన్నా పెద్ద కొవర్టు అంటూ ధ్వజమెత్తారు. నిరంతరం తాను ప్రజా క్షేత్రంలో ఉంటే తనపై అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారని అన్నారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా.. చంద్రబాబు ఎవ్వరి మాటలను నమ్మలేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
Read More: Breaking: నాస్తాయి అధికాదు.. ఆయనే నా టార్గెట్..కేశినేని నాని