- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు కోసం ఏపీ టుమారో ప్రతినిధుల డిజిటల్ సంతకాల సేకరణ: సుప్రీంకోర్టుకు అందజేత
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందని ఏపీ టుమారో ప్రతినిధులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఏపీ టుమారరో మహిళా ప్రతినిధులు డిజిటల్ సంతకాల ప్రతులను అందజేశారు. గత 37 రోజులుగా అక్రమ అరెస్టులో చంద్రబాబును నిర్బంధించడానికి నిరసిస్తూ ఏపీ టుమారో ప్రతినిధులు డిజిటల్ సంతకాల సేకరణ చేపట్టారు. గతవారం మూడు రోజుల్లో సేకరించిన 36 లక్షల సంతకాలను సుప్రీంకోర్టుకు మహిళా ప్రతినిధులు అందజేశారు. చంద్రబాబుకు న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందని ఏపీ టుమారో ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు న్యాయం చేయాలంటూ ఒక వెబ్‌సైట్‌లో పెట్టిన వినతి పత్రానికి 62 దేశాల నుంచి మద్దతు వచ్చింది అని ఏపీ టుమారో ప్రతినిధులు తెలిపారు. రాజకీయాలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా చంద్రబాబు బయటికి రావాలని కోరుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎవరు రాజకీయ నాయకుడిలా చూడటం లేదు అని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కుటుంబ పెద్దగానే చంద్రబాబును భావిస్తున్నారని ఆయనను జైల్లో పెట్టినందుకు బాధపడుతున్నారు అని చెప్పుకొచ్చారు. 72ఏళ్ల వయసులో జీవితమంతా రాష్ట్రం కోసమే పరితపించారని అభివృద్ధికి పాటు పడ్డారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అపార జ్ఞానం అనుభవం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు అవసరం అని ఏపీ టుమారో మహిళా ప్రతినిధులు తెలిపారు. ఏపీ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తిని కటకటాల వెనక కూర్చోబెట్టారు అని ఆరోపించారు. చంద్రబాబుకి న్యాయం ఎప్పుడు జరుగుతుందో అని సామాన్య ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. చంద్రబాబు విషయంలో విచారణ ఆలస్యం చేయకుండా త్వరితగతిన న్యాయం చేకూర్చాలని వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టుకు డిజిటల్ సంతకాలు అందజేసిన వారిలో ఏపీ టుమారో మహిళా ప్రతినిధులు హేమా పెద్ది, ఆవగడ్డ అనిత, శ్రీదేవి జి, విజయలక్ష్మి రావి, యామిని పోతినేని తదితరులు ఉన్నారు.