రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు..

by Disha Web Desk 12 |
రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లురి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి.

రేపు చిత్తూరు, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాలో వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షం పడే సమయంలో పొలాల, బోరు బావులు, ఎత్తైన చెట్టు కింద ఎవరూ ఉండవద్దని సూచించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న నగర వాసులకు వర్షం కారణంగా ఉపశమనం కలిగింది.

Next Story