‘తల్లికి వందనం’ పై సీఎం కీలక ప్రకటన.. అకౌంట్‌లో డబ్బులు జమ అప్పుడే!

by Jakkula Mamatha |   ( Updated:2025-03-16 08:42:59.0  )
‘తల్లికి వందనం’ పై సీఎం కీలక ప్రకటన.. అకౌంట్‌లో డబ్బులు జమ అప్పుడే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఏపీలో కీలకమైన పథకాలు రెండు ఉన్నాయి. ఒకటి అన్నదాత సుఖీభవ. రెండోది తల్లికి వందనం.

ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు తీపీ కబురు అందింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. శనివారం సీఎం చంద్రబాబు తణుకులో గ్రామస్థులతో మాట్లాడినప్పుడు.. వాళ్లు తల్లికి వందనం గురించి అడగ్గా.. సీఎం స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) తల్లికి వందనం పథకం పై రిలీఫ్ కలిగించే విషయం చెప్పారు.

దీంతో మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. తాజాగా సీఎం చంద్రబాబు మే నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో మే నెలలో ప్రతి విద్యార్థికీ రూ.15,000 చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి చదివే వారికి ఈ డబ్బులు ఇస్తారు. ఈ డబ్బును ఒకే దశలో ఇస్తారా? లేక 2 వాయిదాలుగా ఇస్తారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Next Story