సీఎం వైఎస్ జగన్ విశాఖ షిఫ్ట్ అయ్యేది అప్పుడే!: వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

by Seetharam |   ( Updated:2023-10-13 10:13:20.0  )
YV Subbareddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయదశమి నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజధాని తరలింపు అంశంపై వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. దొడ్డి దారిన వైజాగ్ రావాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గానీ తమకు గానీ లేదు అని చెప్పుకొచ్చారు. రైట్ రాయల్‌గా హైవే మీదే సీఎం వైఎస్ జ‌గ‌న్ వ‌స్తార‌ని పేర్కొన్నారు. విశాఖ రాజ‌ధాని అంశంపై విపక్షాల చేస్తున్న విమర్శలకు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.సీఎం క్యాంపు ఆఫీస్‌కు సంబంధించి నిర్మాణాలు పూర్తయ్యాక వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని తెలిపారు. అయితే అది అక్టోబర్ కావొచ్చు.. నవంబర్‌ కావొచ్చు అని వెల్లడించారు. రాజధాని వసతుల కమిటీ ఒకసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్‌లు ఫైనలైజ్ అవుతాయ‌ని వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

గంటా ఎక్కడ నుంచి వచ్చారు?

పచ్చ కామెర్లతో ఉన్న టీడీపీ నేతలకు వైజాగ్‌ అభివృద్ది, ఆకాంక్ష పట్టదని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. విశాఖను రాజధానిగా ఆ ప్రాంతం ప్రజలు కోరుకోవడం లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనడంపై మండిపడ్డారు. అసలు గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి వచ్చారు..? అని నిలదీశారు. వియ్యంకుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గంటా.. అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ చేసిన కామెంట్స్‌ను వైవీ సుబ్బారెడ్డి సమర్థించుకున్నారు. అసలు అభ్యర్థులే కరువైన పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుకోవడం వృథా అంటూ వైవీ సుబ్బారెడ్డి విముఖత వ్యక్తం చేశారు.

Advertisement

Next Story