- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యాసిడ్ దాడి నిందితుడిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం, పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై యాసిడ్ దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆ సోదరికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామన్నారు. గౌతమిపై అత్యంత అమానవీయంగా వ్యవహరించిన సైకోని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో మరో చెల్లిపై ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.