భగీరథ మహర్షికి సీఎం జగన్ నివాళి

by samatah |
భగీరథ మహర్షికి సీఎం జగన్ నివాళి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం జరిగింది. భగీరథ మహర్షి చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఏపీ సగర, ఉప్పర వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ జి.రమణమ్మ, గిద్దలూరు వైఎస్‌ఆర్‌సీపీ పరిశీలకుడు బంగారు శీనయ్య పాల్గొన్నారు.

Next Story

Most Viewed