- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు తిరుపతికి వెళ్లనున్న సీఎం జగన్..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..?

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు తిరుపతి లోని తాజ్ హోటల్ లో ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. కాగా సీఎం జగన్ తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. కాగా తిరుపతి వెళ్లేందుకు ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి లోని తన నివాసం నుంచి సీఎం బయలుదేరుతారు.
తిరుపతికి చేరుకున్న అనంతరం తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న సంస్కరణలపై ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్ ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి రానున్నారు. కాగా జగన్ తిరుపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని అధికారులు చేస్తున్నారు.