ఏపీలో మరో వారంలో ఎన్నికలు.. సీఎం జగన్ తీవ్ర ఆందోళన

by srinivas |   ( Updated:6 May 2024 1:56 PM  )
ఏపీలో మరో వారంలో ఎన్నికలు..  సీఎం జగన్ తీవ్ర ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: మరో వారంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను లేకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమని చెప్పారు. ఇష్టానుసారంగా అధికారులను బదిల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నలో వైసీపీ అభ్యర్థుల తరపున సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు మంచి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి భూములు వారికివ్వడమే ఈ యాక్ట్ లక్ష్యమన్నారు. భూ వివాదాలు తలెత్తకూడదనే ఈ యాక్ట్‌ను తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. యాక్ట్ వల్ల ఎలాంటి నష్టముండదని.. అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఉందన్నారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులను భద్రంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. రైతులందరికీ భూ హక్కు పత్రాలు అందజేస్తామా సీఎం జగన్ పేర్కొన్నారు.

Read More..

ఏపీ అభివృద్ధికి ప్రధాని భరోసా.... చంద్రబాబు రియాక్షన్ ఇదే..!

Next Story

Most Viewed