నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు.. స్వామివారికి పట్టువస్త్రాలు

by Y.Nagarani |
నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు.. స్వామివారికి పట్టువస్త్రాలు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లనున్నారు. రెండురోజులపాటు ఆయన తిరుమలలోనే పర్యటించనున్నట్లు ఈఓ శ్యామలరావు వెల్లడించారు. నేటి సాయంత్రానికి రేణిగుంట చేరుకుని.. అక్కడ శ్రీ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాత్రి 9 గంటలకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి శ్రీ పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు.

రేపు ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబునాయుడు శ్రీ వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే నేటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ వాహన సేవలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 8న గరుడవాహన సేవ మాత్రం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుందని మరోసారి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed