CM Chandrababu: రూ.10లక్షల కోట్లు అప్పు చేసి జంపయ్యారు.. జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

by Shiva |
CM Chandrababu: రూ.10లక్షల కోట్లు అప్పు చేసి జంపయ్యారు.. జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి జంప్ అయ్యిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu), మాజీ సీఎం జగన్‌ (YS Jagan)పై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన ఎన్టీఆర్ జిల్లా (NTR District) ముప్పాళ్ల (Muppalla)లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించని సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి మరుక్షణం నుంచి రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వచ్చిన లాభాలను నిరపేదలకు పంచుతామని తెలిపారు. నాయకుడు దూర దృష్టితో ఆలోచిస్తే.. జాతి బాగుపడుతుందని అన్నారు. రాష్ట్ర జనాభా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సోసైటీనే తమ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, మెల్లిమెల్లి అన్నింటినీ చక్కదిద్దుకుంటూ వస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.



Next Story

Most Viewed